Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు

Youtuber surprised her parents with their very first flight journey
Advertisement
  • అమ్మానాన్నలను తొలిసారి విమానం ఎక్కించిన యువతి
  • ఆనందంతో మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు
  • ఢిల్లీకి చెందిన యూట్యూబర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
Advertisement
తల్లిదండ్రుల కోర్కెలను నెరవేర్చడంలో ఉండే సంతృప్తి ఎంతో ప్రత్యేకం. ఢిల్లీకి చెందిన ఓ యూట్యూబర్ తన అమ్మానాన్నల చిరకాల కోరికను నెరవేర్చి వారి కళ్లల్లో ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. యూప రెబే అనే యువతి తన తల్లిదండ్రులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇద్దరినీ తొలిసారి విమానం ఎక్కించింది. 

జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనే వారి చిరకాల కోరికను నెరవేర్చి అబ్బురపరచింది. కాగా అపురూపమైన ఈ ఆనంద క్షణాలను యూప రెబే తన సెల్‌ఫోన్‌లో బంధించింది. తొలిసారి విమానాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురవ్వడం వీడియోల్లో కనిపించింది. విమానం ఎక్కడానికి ముందు సంతోషంగా ఫొటోలు దిగారు.  విమానం టేకాఫ్‌కు ముందు రెబే తండ్రి దేవుడిని తలచుకొని ప్రార్థిస్తున్నట్టుగా వీడియోలో కనిపించింది.

‘‘కొందరికి ఇది కేవలం ఒక విమాన ప్రయాణం మాత్రమే కావొచ్చు. కానీ కొందరి కల నిజమైంది’’ అంటూ తల్లిదండ్రుల తొలి విమాన ప్రయాణ అనుభవం గురించి యూప రెబే సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. ప్రత్యేకమైన రోజు కోసం ఇద్దరినీ రెడీ చేయడాన్ని చాలా ఇష్టపడ్డానని ఆమె చెప్పారు. కాగా హృదయాన్ని హత్తుకునే ఈ ఘటన నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

‘‘మీలాంటి కూతురిని ఇచ్చినందుకు మీ నాన్న దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని నేను భావిస్తున్నాను’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘‘ చాలా అద్భుతంగా, అందంగా అనిపిస్తోంది. మీ అమ్మగారి జుట్టుని అలంకరించడం నుంచి మీ నాన్న కోరుకున్న క్షణాలను సెల్‌ఫోన్‌లో బంధించడం వరకు ఒక అనుభవాన్ని వారికి బహుమతిగా అందించారు’’ అని పేర్కొన్నారు. సగటు మధ్యతరగతి భారతీయుల సంస్కృతి ఇదేనని, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని మరో వ్యక్తి మెచ్చుకున్నాడు.
Advertisement
Advertisement
Delhi Youtuber
Flight journey
Delhi
Viral News

More Telugu News